Bathukamma Song Lyrics on Telangana
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, తెలంగాణ బతుకమ్మ ఉయ్యాలో
కెసిఆర్ దీక్ష ఉయ్యాలో, ఉద్యమం షురూ అయ్యింది ఉయ్యాలో
విద్యార్థులు పోరాటం ఉయ్యాలో, ఉద్యమం ఊపు వచ్చింది ఉయ్యాలో
కాళోజి కవితలు ఉయ్యాలో, పెద్ద సార్ స్ఫూర్తి ఉయ్యాలో
ధూమ్ ధామ్ పాటలు ఉయ్యాలో, తీన్ మార్ డాన్సులు ఉయ్యాలో
కోదండరామ్ సార్ JAC ఉయ్యాలో,తెలంగాణ కదిలింది ఉయ్యాలో
బట్టే బాజ్ చానల్స్ ఉయ్యాలో, కిరి కిర్ పెట్టిండ్రు ఉయ్యాలో
T న్యూస్ వచ్చింది ఉయ్యాలో, మన గుండె సప్పుడు అయ్యింది ఉయ్యాలో
దెబ్బలు తిన్నాం ఉయ్యాలో, దెబ్బ కొట్టలేదు ఉయ్యాలో
మిలియన్ మార్చ్ ఉయ్యాలో, సకల జనుల సమ్మె చేసినం ఉయ్యాలో
బిల్లు పెట్టిండ్రు ఉయ్యాలో, పెప్పర్ స్ప్రే కొట్టిండ్రు ఉయ్యాలో
తెలంగాణ వచ్చింది ఉయ్యాలో,తెలంగాణ సాదించినం ఉయ్యాలో
తెలంగాణ ప్రజలు ఉయ్యాలో, సంబరాలు చెసుకుండ్రు ఉయ్యాలో
ఎన్నికలు వచ్చినై ఉయ్యాలో, తెలంగాణ గెలించింది ఉయ్యాలో
కెసిఆర్ CM ఉయ్యాలో, బంగారు తెలంగాణ ఉయ్యాలో
కవితమ్మ కవితమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో
తెలంగాణ తెలంగాణ ఉయ్యాలో, జై జై తెలంగాణా ఉయ్యాలో